AP: ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి షార్ట్ మార్కుల మెమోలను విడుదల చేశారు. ఈ మెమోలు పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి, సంతకం, సీల్‌తో విద్యార్థులకు అందించాలి. విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే, ఈ నెల 29 నుంచి జూన్ 4 వరకు మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు.