NEET UG 2025: నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

NEET UG 2025: నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

P Madhav Kumar


NEET UG 2025 : నీట్​ యూజీ 2025కి అప్లికేషన్​ ఫామ్​ని ఫిల్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, చేయకూడని తప్పులు వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నీట్​ యూజీ 2025 అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేస్తున్నారా?
నీట్​ యూజీ 2025 అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేస్తున్నారా? (Unsplash)

నీట్​ యూజీ 2025 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) ఇటీవలే ప్రారంభించింది. అభ్యర్థులు.. మార్చ్​ 7 వరకు తమ అప్లికేషన్​లను ఫిల్​ చేయవచ్చు. అయితే, అప్లికేషన్​ ఫామ్​ని ఫిల్​ చేసే సమయంలో విద్యార్థులకు చాలా ప్రశ్నలు వస్తుంటాయి. తప్పు చేస్తే అప్లికేషన్​ రిజెక్ట్​ అవుతుందేమో అని భయపడుతుంటారు. ఇందుకోసం అభ్యర్థులందరూ ముందు నీట్ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదవాలి, సూచనలు చదవాలి. అర్హత ప్రమాణాలను చెక్​ చేయాలి. డాక్యుమెంట్లు, అవసరమైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ నేపథ్యంలో నీట్​ యూజీ 2025 అప్లికేషన్​ దరఖాస్తు గురించి తెలిసుకోవాల్సిన వివరాలను ఇక్కడ చూడండి..

నీట్ యూజీ 2025..

  • మీ నీట్​ యూజీ 2025 అప్లికేషన్​ ఫామ్ సబ్మిట్ చేసిన తరువాత, వచ్చే కన్ఫర్మేషన్​ పేజ్​ని కచ్చితంగా డౌన్​లోడ్​ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాల నుంచి రుసుము చెల్లింపు రుజువు ఒక్కటే అప్లికేషన్​ని ధ్రువీకరించేందుకు పనిచేయదు. అందుకే కన్ఫర్మేషన్​ పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకోవాలి. 
  • ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తులను ఉపసంహరించుకోలేమని, ఒకసారి జమ చేసిన పరీక్ష ఫీజును తిరిగి వెనక్కి రాదని విద్యార్థులు గ్రహించాలి.
  • తల్లిదండ్రులు, అభ్యర్థుల పేర్లు, ఫొటోతో కూడిన 12వ తరగతి అడ్మిట్ కార్డు, ఈపీఐసీ నంబర్​తో కూడిన ఎలక్షన్ కార్డు, పాస్ పోర్టు నెంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డు నెంబర్, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫామ్​ని నింపడానికి ముందు సమాచార బులెటిన్ అపెండిక్స్​-XVలో ఇచ్చిన దరఖాస్తు ఫామ్​ రెప్లికాని చదవండి.
  • అభ్యర్థులు ఈ క్రింది గుర్తింపు వివరాలలో దేనినైనా అందించాలి:
అభ్యర్థుల కేటగిరీఈ ఐడీలు చెల్లుతాయి
Indian NationalsClass 12 Admit Card, Aadhaar Card, Election Card (EPIC No.), Ration Card, Bank Account Passbook with Photograph, Passport Number or Number of any other Photo Identity Card issued by Government
Foreign Nationals/OCIPassport Number/Citizenship Certificate Number
NRIsPassport Number
  • సూచించిన ఆకృతిలో ఈ క్రింది స్కాన్ చేసిన చిత్రాలను సిద్ధంగా ఉంచండి:

➢ JPG/JPEG ఫార్మాట్​లో లేటెస్ట్​ పాస్​పోర్ట్ సైజ్ ఫోటో (పరిమాణం: 10 kb నుంచి 200 kb)

➢ JPG/JPEG ఫార్మాట్​లో స్కాన్ చేసిన సంతకం (పరిమాణం: 10 kb నుంచి 50 kb)

➢ JPG/JPEG (పరిమాణం:10 kb నుంచి 200 kb) లో ఎడమ, కుడి చేతి వేళ్లు- బొటనవేలు ముద్రలు.

➢ పీడబ్ల్యూడీ/ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్​ పీడీఎఫ్​ ఫార్మాట్​ -ఒకవేళ వర్తిస్తే! (ఫైల్ పరిమాణం: 50 kb నుంచి 300 kb)

➢ పౌరసత్వ సర్టిఫికెట్​/ ఎంబసీ సర్టిఫికేట్​ పీడీఎఫ్​ ఫార్మాట్​లో (ఫైల్ పరిమాణం: 50 kb నుంచి 300 kb)

  • అభ్యర్థులు పూర్తి శాశ్వత చిరునామాను పిన్ కోడ్, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నెంబర్​ సహా నింపాలి. ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అభ్యర్థి లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడిది మాత్రమే అయ్యి ఉండాలి.
  • కోచింగ్ సెంటర్, ఇంటర్నెట్ కేఫ్ మొదలైన వాటి చిరునామా, కాంటాక్ట్ వివరాలు (కాంటాక్ట్ నంబర్ / ఇమెయిల్ చిరునామా) ఇవ్వవద్దు.
  • ఆఫ్​లైన్​ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవద్దు. ఎందుకంటే ఇది ఆమోదం పొందదు.
  • అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మేషన్ పేజ్​ని ఎన్టీఏకు పంపాల్సిన అవసరం లేదు. ఏదేమైనా, ధృవీకరణ పేజీ కనీసం నాలుగు కాపీలు, ఫీజు చెల్లింపు రుజువును భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపరచుకోండి.
  • మీరు లద్ధాఖ్, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థి అయితే 15 శాతం ఆలిండియా కోటా కింద సీట్ల కోసం ఆన్​లైన్​లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి.

మరిన్ని వివరాల కోసం ఇన్ఫర్మేషన్ బులెటిన్​ని చెక్​ చేయడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow