SBI Clerk Prelims Admit Card : ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

SBI Clerk Prelims Admit Card : ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

P Madhav Kumar

 

ఎస్బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫిబ్రవరి 10, 2025 నాటికి క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డును విడుదల చేస్తుంది. జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు అవ్వాల్సిన అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్​సైట్ నుంచి అడ్మిట్ కార్డు లింక్​ని చెక్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు..

ఎస్బీఐ ప్రిలిమ్స్ పరీక్ష కోసం ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ 2025 విడుదల ఖచ్చితమైన తేదీ, సమయాన్ని బ్యాంక్ విడుదల చేయలేదు. అయితే ఫిబ్రవరి 10లోపు రిలీజ్​ చేస్తామని మాత్రం వెల్లడించింది.

అధికారిక వెబ్​సైట్ ప్రకారం.. “ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తాత్కాలిక తేదీలు 22, 27, 28 ఫిబ్రవరి 2025, మార్చి 1. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్​లోడ్ కోసం లింక్​ని బ్యాంక్ వెబ్​సైట్​లో 2025 ఫిబ్రవరి 10 నాటికి ప్రచురిస్తారు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలి,” అని ఉంది.

జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షను 2025 ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆన్​లైన్ ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు సెక్షన్లతో ఈ పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు వస్తాయి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు. వ్యక్తిగత పరీక్షలకు లేదా మొత్తం స్కోర్లకు కనీస అర్హత మార్కులు సూచించబడవు.

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు 2025: ఇలా డౌన్​లోడ్ చేసుకోండి..

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులందరూ ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు.

1. sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్స్ లింక్​పై క్లిక్ చేయండి.

3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు కరెంట్ ఓపెనింగ్స్ లింక్​పై క్లిక్ చేయాలి.

4. ఇప్పుడు పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్​పై క్లిక్ చేయండి.

5. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.

6. ఒకసారి చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డు డిస్​ప్లే అవుతుంది.

7. అడ్మిట్ కార్డును చెక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.

8. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలో 13735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభమై 2025 జనవరి 7న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow