ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డీఎస్సీలో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉండగా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2259 పోస్టులున్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలను జిల్లా స్థాయిలో నియామకాల్లో భర్తీ చేస్తారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోన స్థాయిల్లో భర్తీ చేస్తారు.
పాఠశాలల వారీగా ఖాళీలు
- ప్రభుత్వ, మండల, పురపాలక, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో -13192 ఖాళీలు
- గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో -881 ఖాళీలు
- జువెనైల్ పాఠశాలల్లో -15 ఖాళీలు
- బధిరులు, అంధుల పాఠశాలల్లో - 31 ఖాళీలు
జువెనైల్ పాఠశాలల్లో ఖాళీలు -15 పోస్టులు
- విశాఖ - 5(ఎస్జీటీ -4, పీఈటీ-1)
- ఏలూరు -7(ఎస్జీటీ-6, పీఈటీ-1)
- వైఎస్ఆర్ కడప-3 (ఎస్జీటీ-3)
ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్-1 గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. పేపర్-1లో అర్హత సాధిస్తేనే పేపర్-2 లో మార్కులను పరిగణిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20 శాతం కల్పిస్తారు.
జోన్ల వారీగా ఖాళీలు
- జోన్-1 : 400 (పీజీటీ-73, టీజీటీ-299, పీడీ-6, పీఈటీ-22)
- జోన్ -2 : 348 (పీజీటీ-49, టీజీటీ-272, పీడీ-3, పీఈటీ-24)
- జోన్ -3 : 570 (పీజీటీ-31, టీజీటీ-470, పీడీ-2, పీఈటీ-67)
- జోన్ -4 : 682 (పీజీటీ-67, టీజీటీ-557, పీడీ-2, పీఈటీ-56)
- మొత్తం పోస్టులు -2228(ప్రిన్సిపల్-52, పీజీటీ-273, టీజీటీ-1718, పీడీ-13, పీఈటీ-172)
- రాష్ట్రస్థాయి పోస్టులు-228(ప్రిన్సిపల్-52, పీజీటీ-53, టీజీటీ-120, పీడీ-0, పీఈటీ-3)
దివ్యాంగు స్కూళ్లలో పోస్టులు -మొత్తం 31 ఖాళీలు
- బధిరుల పాఠశాల -11 ఖాళీలు(టీజీటీ తెలుగు-1, టీజీటీ గణితం-2, టీజీటీ ఫిజిక్స్-2, పీఈటీ-1, ఎస్జీటీ-5)
- అంధుల పాఠశాల -20 ఖాళీలు(టీజీటీ హిందీ-3, టీజీటీ ఫిజిక్స్ -3, టీజీటీ జీవశాస్త్రం-2, పీఈటీ -2, ఎస్జీటీ-10)
జిల్లా స్థాయి పోస్టుల వివరాలు ఇలా
- ప్రభుత్వ, మండల, జిల్లా , మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం ఖాళీలు -13,192
- వీటిలో ఎస్జీటీలు -5985 పోస్టులు
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు
- శ్రీకాకుళం - 458 (స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 37, హిందీ-11, ఇంగ్లీషు -65, గణితం -33, ఫిజిక్స్-14, జీవశాస్త్రం-34, సోషల్-70, ఎస్ఏ పీఈటీ-81, ఎస్జీటీ-113)
- విజయనగరం- 446(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 :14, హిందీ-14, ఇంగ్లీషు -23, గణితం -8, ఫిజిక్స్-32, జీవశాస్త్రం-20, సోషల్-62, ఎస్ఏ పీఈటీ-63, ఎస్జీటీ-210)
- విశాఖపట్నం -734(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1: 26, హిందీ-28, ఇంగ్లీషు -55, గణితం -59, ఫిజిక్స్-39, జీవశాస్త్రం-58, సోషల్-91, ఎస్ఏ పీఈటీ-139, ఎస్జీటీ-239)
- తూర్పుగోదావరి -1241(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 65, హిందీ-78, ఇంగ్లీషు -95, గణితం -64, ఫిజిక్స్-71 , జీవశాస్త్రం-103, సోషల్-132, ఎస్ఏ పీఈటీ-210, ఎస్జీటీ-423)
- పశ్చిమ గోదావరి -1035(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 :42, హిందీ-61, ఇంగ్లీషు -84, గణితం -40, ఫిజిక్స్-40, జీవశాస్త్రం-64, సోషల్-103, ఎస్ఏ పీఈటీ-181, ఎస్జీటీ-420)
- కృష్ణా -1208(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 39, హిందీ-25, ఇంగ్లీషు -93, గణితం -52, ఫిజిక్స్-54, జీవశాస్త్రం-142, సోషల్-135, ఎస్ఏ పీఈటీ-123, ఎస్జీటీ-545)
- గుంటూరు -1143(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 42, హిందీ-57, ఇంగ్లీషు -69, గణితం -35, ఫిజిక్స్-58, జీవశాస్త్రం-86, సోషల్-109, ఎస్ఏ పీఈటీ-166, ఎస్జీటీ-521)
- ప్రకాశం -629(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 39, హిందీ-23, ఇంగ్లీషు -95, గణితం -94, ఫిజిక్స్-24, జీవశాస్త్రం-70, సోషల్-106, ఎస్ఏ పీఈటీ-72, ఎస్జీటీ-106)
- నెల్లూరు -668(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 39, హిందీ-18, ఇంగ్లీషు -84, గణితం -63, ఫిజిక్స్-76, జీవశాస్త్రం-63, సోషల్-103, ఎస్ఏ పీఈటీ-107, ఎస్జీటీ-115)
- చిత్తూరు -1473(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 38, హిందీ-17, ఇంగ్లీషు -104, గణితం -30, ఫిజిక్స్-29, జీవశాస్త్రం-63, సోషల్-130, ఎస్ఏ పీఈటీ-86, ఎస్జీటీ-976)
- కర్నూలు -2645(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 82, హిందీ-114, ఇంగ్లీషు -81, గణితం -90, ఫిజిక్స్-66, జీవశాస్త్రం-74, సోషల్-112, ఎస్ఏ పీఈటీ-209, ఎస్జీటీ-1817)
- వైఎస్సార్ కడప -705(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 34, హిందీ-18, ఇంగ్లీషు -81, గణితం -44, ఫిజిక్స్-30, జీవశాస్త్రం-53, సోషల్-65, ఎస్ఏ పీఈటీ-82, ఎస్జీటీ-298)
- అనంతపురం - 807(స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్-1 : 37, హిందీ-28, ఇంగ్లీషు -103, గణితం -43, ఫిజిక్స్-66, జీవశాస్త్రం-72, సోషల్-111, ఎస్ఏ పీఈటీ-145, ఎస్జీటీ-202)
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు- 881 పోస్టులు(ఎస్జీటీలు 601)
- శ్రీకాకుళం -85 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-12, గణితం-13, ఫిజిక్స్-10, జీవశాస్త్రం-12, సోషల్ -5, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-33)
- విజయనగరం-137 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-7, గణితం-25, ఫిజిక్స్-24, జీవశాస్త్రం-16, సోషల్ -5, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-60)
- విశాఖపట్నం -400 పోస్టులు(తెలుగు-7, హిందీ-11, ఇంగ్లీషు-0, గణితం-7, ఫిజిక్స్-35, జీవశాస్త్రం-0, సోషల్ -5, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-335)
- తూర్పుగోదావరి -112 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-0, గణితం-0, ఫిజిక్స్-3, జీవశాస్త్రం-4, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-1, ఎస్జీటీ-104)
- పశ్చిమగోదావరి -32 పోస్టులు(తెలుగు-4, హిందీ-5, ఇంగ్లీషు-1, గణితం-0, ఫిజిక్స్-0, జీవశాస్త్రం-1, సోషల్ -4, ఎస్ఏ పీఈటీ-3, ఎస్జీటీ-14)
- కృష్ణా- 5 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-1, గణితం-0, ఫిజిక్స్-1, జీవశాస్త్రం-1, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-2)
- గుంటూరు -16 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-1, గణితం-2, ఫిజిక్స్-1, జీవశాస్త్రం-1, సోషల్ -1, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-10)
- ప్రకాశం-43 పోస్టులు(తెలుగు-2, హిందీ-4, ఇంగ్లీషు-4, గణితం-1, ఫిజిక్స్-2, జీవశాస్త్రం-2, సోషల్ -2, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-26)
- నెల్లూరు -5 పోస్టులు(తెలుగు-0, హిందీ-1, ఇంగ్లీషు-1, గణితం-1, ఫిజిక్స్-0, జీవశాస్త్రం-0, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-2)
- చిత్తూరు -5 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-0, గణితం-1, ఫిజిక్స్-1, జీవశాస్త్రం-1, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-2)
- కర్నూలు -33 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-7, గణితం-4, ఫిజిక్స్-4, జీవశాస్త్రం-4, సోషల్ -2, ఎస్ఏ పీఈటీ-2, ఎస్జీటీ-10)
- వైఎస్సార్ కడప -4 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-0, గణితం-1, ఫిజిక్స్-1, జీవశాస్త్రం-1, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-1)
- అనంతపురం -4 పోస్టులు(తెలుగు-0, హిందీ-0, ఇంగ్లీషు-0, గణితం-0, ఫిజిక్స్-1, జీవశాస్త్రం-1, సోషల్ -0, ఎస్ఏ పీఈటీ-0, ఎస్జీటీ-2)