- నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ లభిస్తాయి.
Tue, 22 Apr 202507:17 AM IST
తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లతో సహా 1,532 మంది పరీక్షా సిబ్బందిని నియమించారు.
Tue, 22 Apr 202506:54 AM IST
తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల డైరెక్ట్ లింక్స్ ఇవే
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోండి ఇలా…
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ ద్వారా అందరి కంటే ముందు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింకులను అనుసరించండి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్ :
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్ :
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్ :
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :
ఇంటర్ వెబ్‌సైటులో ఫలితాలు
ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Tue, 22 Apr 202506:35 AM IST
ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఇప్పటికే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. దీంతో తెలంగాణ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 22న ఫలితాల విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Tue, 22 Apr 202506:03 AM IST
ఫలితాల కోసం ఎదురు చూస్తున్న 9.5లక్షల మంది విద్యార్థులు
తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం 9.5లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
Tue, 22 Apr 202506:02 AM IST
ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం
మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
Tue, 22 Apr 202506:01 AM IST
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్,సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
Tue, 22 Apr 202505:51 AM IST
ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :