(1 / 6)
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. మే 2వ తేదీన ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
(2 / 6)
రేపు(మే 2) మధ్యాహ్నం తర్వాత ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్ మార్కులతో పాటు విద్యార్థులు ఎంచుకునే ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
(3 / 6)
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
(4 / 6)
దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

(5 / 6)
గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు. ఈసారి కూడా మొత్తం 3 విడతల్లో సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.
(6 / 6)
దోస్త్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల ఫీజుతో పాటు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, అలాట్ మెంట్ కాపీలు పొందటం వంటి ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు. 7)