AP EAPCET(EAMCET) 2025 Applications : ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఈఏపీసెట్ 2025 దరఖాస్తులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 19 నుంచి 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

మే 12 నుంచి హాల్ టికెట్లు….
రూ. 1000 ఆపరాద రుసుంతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో మే 7 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించారు. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. మే 12వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా వీటిని పొందవచ్చు.
ఈఏపీసెట్ పరీక్ష తేదీలు:
వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుగుతుంది. రోజుకు రెండు విడతలుగా ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21న వెల్లడించారు. ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేస్తారు. తుది ‘కీ’ని జూన్ 5న ప్రకటిస్తారు. ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇందుకోసం ఏపీ(46), తెలంగాణలో(02) కలిపి మొత్తం 48 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తు విధానం…
- ఏపీఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే APEAPCET - 2025పై క్లిక్ చేయాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ పై నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు