
(1 / 9)
తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి(మే 31) అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

(2 / 9)
ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ…. జూన్ 21వ తేదీతో ముగుస్తుంది.

(3 / 9)
జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

(4 / 9)
అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇందులో యూజీ అడ్మిషన్లు 2025 -26 కాలమ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆపై అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. https://www.rgukt.ac.in/admissions2025.html లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రాసెస్ చేసుకోవచ్చు.

(5 / 9)
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది బాసరలోని 1500 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్ లోనూ ఐఐఐటీ క్యాంపస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను ఖరారు చేశారు. ఇక్కడ 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

(6 / 9)
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.

(7 / 9)
ఒకవేళ 2 విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.

(8 / 9)
బాసర ఆర్జీయూకేటీలో బయో సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ విభాగాలు ఉన్నాయి.

(9 / 9)
ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని అందించే బాసర క్యాంపస్‌లో విద్యార్ధులకు అన్ని హంగులతో కూడిన సదుపాయాలు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాళ్లు, సెంట్రల్ లైబ్రరీ, మెడికల్ సదుపాయం, బ్యాంకు ఏటిఎంలు, పోస్ట్ ఆఫీస్, స్పోర్ట్స్ సెంటర్, జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.