Jawahar Navodaya: జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది..! ఇవిగో వివరాలు

Jawahar Navodaya: జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది..! ఇవిగో వివరాలు

P Madhav Kumar

 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదో తరగతి పూర్తయినవారు… ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులు. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి…

జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల
జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 2 విడతల్లో సెలెక్షన్ పరీక్షను పూర్తి చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.వీటిల్లో ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ 9 ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అప్లికేషన్ చేసుకునే వీలు ఉంది.

అప్లికేషన్ ప్రాసెస్….

  1. ముందుగా జవహర్ నవోదయ అధికారిక వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs/?  లోకి వెళ్లి.
  2. హోమ్ పేజీ కనిపించే JNVST ఆరో తరగతి రిజిస్ట్రేషన్ (2026-27) లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ఆపై పూర్తి వివరాలను ఎంట్రీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  4. రిజిస్ట్రేషన్ వివరాలతో అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయాలి.
  5. చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. తదుపరి అవసరాల కోసం రిజిస్ట్రేషన్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

పరీక్ష ఎప్పుడంటే…?

ఏపీ,తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025వ తేదీన ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏడాదిలో ఏప్రిల్ 11వ తేదీన జరగుతుంది.

కావాల్సిన పత్రాలు:

  • పుట్టిన తేదీ ధ్రువపత్రం
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • నిర్దేశిత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ హెడ్ మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికేట్
  • మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
  • మైగ్రేషన్ సర్టిఫికెట్
  • దివ్యాంగ విద్యార్థులు అయితే సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఆదాయ ధ్రువీకరణపత్రం
  • అడ్మిషన్ సమయంలో టీసీ సమర్పించాలి.

పరీక్షా విధానం :

నవోదయ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండదు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow